గ్రామాల స్వరూపాన్ని మార్చుదాం

బెల్ట్‌షాపుల నిరోధం మహిళా పోలీసుల ప్రాథమిక విధి

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగకూడదు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో సిబ్బందిని పెంచాలి

ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ సమీక్షంలో సీఎం వైయస్‌ జగన్‌

 

సచివాలయం: గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామ సచివాలయం, వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాలు, వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్, ఇంగ్లిష్‌ విద్య వంటి మార్పులు తెస్తున్నాం. గ్రామాల సమగ్రాభివృద్ధిలో ఇవన్నీ విప్లవాత్మక మార్పులు తెస్తాయన్నారు. సచివాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్ట్‌షాపులు నడవకూడదని ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని,  ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది వీటిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మహిళా పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవాలన్నారు. బెల్ట్‌షాపుల నిరోధం మహిళా పోలీసుల ప్రాథమిక విధి అని, ఇందుకు మహిళా మిత్రలను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో సిబ్బందిని పెంచాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Back to Top