చిన్నారి లేఖపై స్పందించిన సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి:  ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామంలో తమ కుటుంబాన్ని గ్రామపెద్దలు నుంచి వెలివేయడంతో  కోడూరి పుష్ప అనే అమ్మాయి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే బాలిక వివరాలు కనుక్కోవాలనీ, సమస్యను పరిష్కరించాలని వైయస్‌ జగన్ ఆదేశించారు.

చిన్నారి లేఖలోని సారాంశం ఇలా ఉంది..తనతో స్కూలులో కూడా ఎవరూ మాట్లాడటం లేదనీ, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే రూ.10,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారని చిన్నారి సీఎంకు లేఖ రాసింది. తమకు అండగా నిలవాలని నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ముఖ్యమంత్రిని కోరింది. ఈ విషయం ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు.  
 

Back to Top