రైతు భ‌రోసా సాయం విడుద‌ల‌

వ‌రస‌గా మూడవ‌ ఏడాది, మూడవ విడ‌త సాయం

50.58 లక్షల మంది రైతన్న ఖాతాల్లో రూ.1,036 కోట్లు జ‌మ చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: వరసగా మూడవ ఏడాది, మూడవ విడత వైయ‌స్ఆర్‌ రైతు భరోసా సాయాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జ‌మ చేశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోకి న‌గ‌దు బ‌దిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతన్నలకు రూ.1,036 కోట్ల రైతు భ‌రోసా సాయాన్ని అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు, అగ్రి మిష‌న్ వైస్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

2021–22 సీజన్‌లో రూ.6,899.67 కోట్లు రైతు ఖాతాల్లో జ‌మ అయ్యాయి. గడిచిన మూడేళ్లలో వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా పథకం కింద రూ.19,812.79 కోట్ల పెట్టుబడి సాయం వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ రైతుల‌కు అంద‌జేసింది. వైయ‌స్ఆర్ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తోంది.

తాజా వీడియోలు

Back to Top