క‌న్న‌య‌గుట్ట‌కు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

ఏలూరు: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించారు. అనంతరం బాధితులకు భరోసానిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటన ముగించుకున్న సీఎం వైయస్‌ జగన్‌.. ఏలూరు జిల్లాకు చేరుకున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్క‌డి నుంచి నేరుగా కన్నయగుట్టకు చేరుకున్నారు. కన్నయగుట్టలో వరద బాధితులను కలుసుకొని వారిని పరామర్శిస్తారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు వెళ్లి.. వరద బాధితులను పరామర్శించి.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top