తెనాలి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. తెనాలి మార్కెట్ యార్డ్‌లో సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం వైయస్‌ జగన్‌ పరిశీలిస్తున్నారు. మరికాసేపట్లో నాలుగో ఏడాది మూడో విడత వైయస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ సాయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేయనున్నారు. నాలుగో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 50.92 లక్షల మందికి రూ.5,853.74 కోట్లను అందించారు. మూడో విడత కింద 51.12 లక్షల మంది రైతులకు రూ.2 వేల చొప్పున రూ.1090.76 కోట్లను జమ చేయనున్నారు. అదే విధంగా మాండూస్‌ తుపాన్‌ బాధితులకు రూ.76.99 కోట్ల పరిహారాన్ని అందజేయనున్నారు. 

Back to Top