ఓర్వకల్లు చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

నంద్యాల‌: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఓర్వ‌క‌ల్లు విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. నంద్యాల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గ‌న్న‌వ‌రం నుంచి ప్రత్యేక విమానంలో బ‌య‌ల్దేరిన సీఎం.. కొద్దిసేప‌టి క్రితం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కర్నూలు జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, మేయర్ రామయ్య, ఎమ్మెల్యేలు ఆర్థర్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్ప చక్రపాణిరెడ్డి,  కంగాటి శ్రీదేవి, హాజీఫ్ ఖాన్, చెన్నకేశవరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ్ ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. మ‌రికాసేప‌ట్లో అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 

Back to Top