అమ‌లాపురం చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అమలాపురం: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి డాక్ట‌ర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం చేరుకున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అమ‌లాపురం నుంచి జనుపల్లికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బ‌య‌ల్దేరారు. మ‌రికాసేప‌ట్లో నాలుగో విడత వైయ‌స్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును సీఎం వైయ‌స్‌ జగన్‌ జమ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్‌ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

తాజా వీడియోలు

Back to Top