విజయనగరం చేరుకున్న సీఎం వైయ‌స్ జగన్  

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విజ‌య‌న‌గ‌రం చేరుకున్నారు. ఉద‌యం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరిన సీఎం.. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విశాఖ నుంచి హెలికాప్ట‌ర్‌లో విజ‌య‌న‌గ‌రం చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు డిప్యూటీ సీఎంలు రాజ‌న్న దొర‌, బూడి ముత్యాల‌నాయుడు, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేత‌లు, అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. మ‌రికాసేప‌ట్లో విజ‌య‌న‌గ‌రం ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం వ‌ర్చువ‌ల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీ­పట్నం, నంద్యాలలో  ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. 

Back to Top