అంతర్వేదికి చేరుకున్న‌ సీఎం వైయ‌స్‌ జగన్ 

   కాసేప‌ట్లో కొత్త రథానికి ప్రారంభోత్సవం
 

 కాకినాడ‌: ముఖ్యమంత్రి వైయ‌స్‌జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే అంత‌ర్వేది ఆల‌యానికి చేరుకున్నారు.  అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కు మంత్రులు, అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల అనంత‌రం నూత‌న ర‌థాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శాస్త్రోత్త‌రంగా ప్రారంభిస్తారు.

Back to Top