మొట్ట‌మొద‌టి సంత‌కం వాలంటీర్ల ఫైల్‌పైనే

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హామీ

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా:  జూన్‌ 4న మనం వస్తూనే మన మొట్టమొదటి సంతకం వాలంటీర్ల ఫైల్‌పైనే చేస్తాన‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లంచ్‌ స్టే పాయింట్‌ వద్ద సీఎం  వైయస్‌.జగన్‌ను  రాజీనామా చేసిన వాలంటీర్లు క‌లిశారు. 

రాజీనామా చేసిన వాలంటీర్లను ఉద్దేశించి సీఎం ఏమన్నారంటే...

అంతా రాజీనామా చేశారా? జూన్‌ 4న మనం వస్తూనే మన మొట్టమొదటి సంతకం మరలా మిమ్మల్ని పెట్టడమే. ఇదొక్కటే కాకుండా మీరు ఇంత బాగా పనిచేసారు కాబట్టి...చంద్రబాబునాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. 
మీరు ఇంత బాగా పనిచేశారు కాబట్టి... మీ అందరికీ సేవా మిత్రలు, సేవా వజ్రాలు, సేవా రత్నాలు గతంలో పెంచి ఇచ్చాం. మనం వచ్చిన తర్వాత అవి స్టాండర్డ్‌ చేస్తాను.

Back to Top