పీవీ సేవలు తరతరాలకూ చిరస్మరణీయం

తాడేపల్లి: దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ‘పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. ఆయన ఒక సునిశిత బుద్ధి గల రాజకీయవేత్త. అంతే కాదు, ఒక బహుభాషా కోవిదుడు. ఈ దేశాన్ని పీవీ నరసింహారావు సరళీకృత ఆర్థిక విధానాల వైపు నడిపించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి తరతరాలకూ చిరస్మరణీయంగా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.    
 

Back to Top