వాల్మీకి జ‌యంతిని పండుగ‌గా జ‌రుపుకోవ‌డం సంతోష‌దాయ‌కం

ఆదిక‌వి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించిన సీఎం

తాడేప‌ల్లి: ఆదిక‌వి వాల్మీకి మ‌హ‌ర్షి జయంతి సందర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే కె పార్ధసారథి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం పాల్గొన్నారు. 

పండుగగా జరుపుకోవడం సంతోషదాయకం
ఆదిక‌వి వాల్మీకి మ‌హ‌ర్షి జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``సంస్కృత భాషలో ఆదికవి, శ్రీరాముని చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని మనకు అందించిన మహర్షి వాల్మీకి. నేడు వాల్మీకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజును రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషదాయకం`` అని సీఎం ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top