ఆడారి తులసీరావు భౌతికకాయానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ నివాళులు 

  అనకాపల్లి:  విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు భౌతికకాయానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళులు అర్పించారు. అన‌కాప‌ల్లి జిల్లా యలమంచిలికి బయల్దేరి వెళ్లిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తులసీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

తులసీరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.  ఈ మేరకు తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను సీఎం వైయ‌స్ జగన్ ప‌రామ‌ర్శించారు.

Back to Top