వైయ‌స్ఆర్ పెన్ష‌న్ కానుక‌ వారోత్స‌వాల్లో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రాజ‌మండ్రి: రాజ‌మహేంద్ర‌వ‌రంలో పింఛ‌న్ వారోత్స‌వాల్లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేప‌ల్లి నుంచి రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మండ్రి మున్సిప‌ల్ గ్రౌండ్ నుంచి సాయి కృష్ణ థియేటర్, బీఈడీ కళాశాల, అప్సర థియేటర్, ఆజాద్ చౌక్, నందం గనిరాజు జంక్షన్, వై జంక్షన్ ల మీదుగా ఆర్ట్స్ కాలేజీ వ‌ర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ర్యాలీగా స‌భా వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు. అనంత‌రం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. స్టాల్స్‌ను ప‌రిశీలించారు. వైయ‌స్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో ఫొటో దిగి వారితో మాట్లాడారు. ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ స‌భా వేదిక‌పైకి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. మ‌రికొద్దిసేప‌ట్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పెన్ష‌న్ ల‌బ్ధిదారుల‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

Back to Top