కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాం

రాష్ట్ర ఆదాయం దెబ్బతింది.. ఆదుకోండి

మెడికల్‌ పరికరాలను తగిన సంఖ్యలో అందించండి

వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీని కోరిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో గడచిన రెండు రోజుల్లో నమోదైన కేసుల్లో 111 జమాత్‌కు వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారేనని తెలిపారు. వలంటీర్ల ద్వారా కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి వివరించారు. కరోనా వైరస్‌ సోకిన వారందరికీ క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని తగిన విధంగా ఆదుకోవాలని ప్రధానిని కోరారు. మెడికల్‌ పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. 

Back to Top