ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి నేత‌న్న‌లకు ఏడాదికి రూ.24 వేలు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  ఈరోజు వరుసగా 5వ ఏడాది వైయ‌స్ఆర్‌నేతన్న నేస్తం కార్యక్రమం వెంక‌ట‌గిరిలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. నేత‌న్నల మ‌గ్గాలు ప్ర‌పంచంతో మాట్లాడే నేలైన వెంక‌ట‌గిరిలో నేడు వైయ‌స్ఆర్ నేతన్న‌ నేస్తం ఐదో విడ‌త కార్యక్ర‌మాన్ని మన ప్ర‌భుత్వంలో నిర్వ‌హించాం. మొత్తం 80,686 చేనేత కుటుంబాల ఖాతాల్లో రూ.193.64 కోట్ల‌ను విడుద‌ల చేశాం. బీసీలంటే బ్యాక్‌వార్డ్ క్లాసులు కాదు.. వారిని బ్యాక్‌బోన్ క్లాసులుగా మారుస్తాన‌ని గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి ఈ నాలుగేళ్ళలో నేత‌న్న‌ల ఖాతాల్లో ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదు విడ‌త‌ల్లో రూ.1,20,000 జ‌మ‌చేశాం. ఈ ఒక్క ప‌థ‌కానికే మ‌న ప్ర‌భుత్వం రూ.970 కోట్ల‌ను కేటాయించింది. దేవుడి ద‌య‌తో నేత‌న్న‌ల‌కు తోడుగా నిల‌బ‌డే అవ‌కాశం వచ్చినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top