తాడేపల్లి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల గురించి సీఎం వైయస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. రైతు బాగుంటనే రాష్ట్రం బాగుంటుంది అని కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో వరుసగా నాలుగో ఏడాది కూడా వైయస్ఆర్ రైతు భరోసా అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం వైయస్ జగన్ మంగళవారం తెనాలి మార్కెట్‌యార్డులో జరిగే కార్యక్రమంలో నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయనున్నారు.
రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇవ్వగా, అంతకంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. వరుసగా నాల్గో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2వేల చొప్పున 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను సీఎం వైయస్ జగన్ నేడు జమచేయనున్నారు.