అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదన్న ఈర్ష్య, కడుపు మంటతో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్ పింఛన్లు, వైయస్ఆర్ చేయూత పథకాల ద్వారా లబ్ధిదారులు మేలు చేస్తుంటే ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ రెండు పథకాలపై నిన్న అసెంబ్లీలో వివరంగా చెప్పినా కూడా ఈనాడులో వాస్తవాలు వక్రీకరించి పతాక శీర్షికలో వార్తలు రాయడాన్ని సీఎం ఖండించారు. ఈ రెండు పథకాలపై మరోసారి సభలో తాను ఎన్నికల ముందు చెప్పింది..మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న విధానాన్ని మరోసారి వీడియో ప్రెజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించారు. ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. ఈ రోజు చంద్రబాబు ఉంటారేమో..కనీసం ఈ రోజైనా ఈ పెద్ద మనిషి ఇక్కడే ఉంటే అమూల్ గురించి చర్చించాల్సి ఉంది. అక్కచెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో ఒక ప్రతిపక్ష నేతగా అభినందించాల్సింది పోయి..సభను అడ్డుకోకుండా ఉంటారని వేచి చూశాం. అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో అక్కచెల్లమ్మలకు ఏ రకంగా మేలు జరుగుతుంది. అమూల్ ఆదాయంలో బోనస్ రూపంలో అక్కచెల్లెమ్మలకే ఇస్తామంటున్నారు. ఇవన్నీ చంద్రబాబుకు అర్థమయ్య విధంగా వివరించాలనుకున్నాం. కాకపోతే చంద్రబాబుకు కుళ్లు, కుట్రలు ఎక్కువ కదా? ఏకంగా పోడియం దాటి మీ చైర్‌పై కి తన ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. పద్ధతి ప్రకారం సస్పెన్షన్ చేయించుకోవడం, ఆ తరువాత ఈనాడు, చంద్రజ్యోతి, టీవీ5లో తన ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటారు. ఈనాడు అని పేరు పెట్టుకున్నారు. దానికి క్రెడిబులిటి ఉందా? అబద్ధం అని తెలిసీ...దాన్ని ప్రజలకు చెప్పిందే చెప్పీ గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారు. దిగజారి ప్రచురిస్తున్నారు. పింఛన్..టెన్షన్, సీఎం చెప్పినవన్నీ అబద్ధాలే అని రాశారు. ఇంతకగా క్లిప్పింగ్‌లు వేసి చూపించాం. ఎన్నికల ముందు ఏం జరిగింది? ఎన్నికల తరువాత ఏం చేశామన్నది క్లిప్పింగ్‌లతో సహా చూపించాం. అది నిజం అని తెలిసీ కూడా అబద్ధాలు చేశారు. వీళ్లకు విశ్వసనీయత ఎక్కడైనా ఉందా? నిజమేంటో రాష్ట్రమంతా ఒక్కసారి చూడాలి. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎల్లోమీడియా అబద్ధాలు ఎలా ప్రచారం చేస్తున్నారో ప్రజలందరికీ తెలియాలి. చంద్రబాబు పింఛన్ రూ.1000 నుంచి రూ.2000లకు పెంచుతూ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారో గమనిస్తే..25.01.2019లో ఎన్నికలు ఏప్రిల్‌లో ఉన్నాయి. పెద్ద మనిషి జీవో ఇచ్చింది జనవరి చివరిలో.. ఎన్నికలకు రెండు నెలల ముందు పింఛన్ పెంచారు. నాలుగేళ్ల 10 నెలలు పట్టించుకోకుండా మోసం చేసింది నిజం కాదా? ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతికి కనిపించదా? చంద్రబాబు హయాంలో పింఛన్లు ఎంత ఇచ్చారో గమనిస్తే..అక్టోబర్ 2018లో 45 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. ఎన్నికలకు ముందు దాన్ని రూ.51 లక్షలకు తీసుకెళ్లారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో పింఛన్లు పెంచారు. కేవలం నాలుగు నెలలు మాత్రమే పింఛన్ల సంఖ్య పెంచారు. ఇది అన్యాయం, మోసం కాదా? ఇవి ఎల్లో మీడియాకు కనిపించదు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత పింఛన్ల వివరాలు గమనిస్తే..59,54,140 పింఛన్లు ఇచ్చాం. వాళ్లు రూ.500 కోట్లు కూడా ఇవ్వలేదు. ఇవాళ మనం రూ.1500 కోట్లు ఇస్తున్నాం. వాస్తవాలు తెలిసీ కూడా ఇంతదారుణంగా వక్రీకరించి, మోసం చేస్తున్నారు. నిజంగా వీళ్లు మనుషులేనా? ఎన్నికల సమయంలో ఇదే పింఛన్లకు సంబంధించి నేను ఏమన్నానో గమనించండి..ఈనాడులో పింఛన్లు, వైయస్ఆర్ చేయూతలో సీఎం చెప్పినవన్నీ అబద్ధాలు అని రాశారు. ఎన్నికల మేనిఫెస్టోలో మేం ఏం చెప్పామో? ఎన్నికల ముందు ఏం చెప్పామో గమనించండి. చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారో గమనించండి. కేవలం తాను తన ఎల్లో మీడియాను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు. మేం వచ్చాక పింఛన్ అర్హత వయస్సును తగ్గించాం. జులై 8న దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజున 2021, రూ.2500కు పించన్ పెంచబోతున్నాం. మళ్లీ 2022 జులై 8న రూ.2,500 నుంచి 2,750కి పింఛన్ పెంచుతాం, మళ్లీ జులై 8, 2023న రూ.3000లకు పింఛన్ పెంచుతాం. ఎక్కడా కూడా ఇచ్చిన మాటలో ఏమాత్రం పొరపాటు ఉండదు. మాట ఇస్తే నిలబడే నైజం మాది. ఎక్కడ మోసం ఉండదు. వైయస్ఆర్ చేయూత గురించి కూడా సభలో వివరించాం. ఎన్నికల్లో ఏం చెప్పాం. మేనిఫెస్టోలో క్లియర్‌గా చెప్పాం. నిన్న సభలో స్పష్టంగా క్లిప్పింగ్‌లు కూడా చూపించాం. ఇంత చూపించినా అబద్ధాలు ఎలా రాస్తారు. ఈ రెండు విషయాలపై ప్రజలకు క్లారిటీ రావాలి. చంద్రబాబు నైజం ఎలాంటిదన్నది ప్రజలకు తెలియాలి. వైయస్ఆర్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు అండగా ఉంటామని చెప్పాం. 45ఏళ్లు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైయస్ఆర్ చేయూత ఇస్తామన్నాం. అధికారంలోకి వచ్చాక ఈ పథకం ద్వారా 26.54 లక్షల మంది మహిళలకు ఆర్థికసాయం చేస్తున్నాం. వైయస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత ఏడాదికి రూ.75 వేల సాయం చేశాం. మహిళలకు పశువులు కూడా కొనుగోలు చేయించి, రాష్ట్ర ప్రభుత్వమే అమూల్ లాంటి సంస్థతో ఒప్పందం చేసుకొని వారి చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాం. 2.49 లక్షల మేమేకలు, గొర్రెల యూనిట్లు..ఒక్క యూనిట్ అంటే 15 గొర్రెలు, 15 మేకలు, 14 ఆడవి, ఒక మగవి యూనిట్‌గా మహిళలకు పంపిణీ చేస్తున్నాం. ఇందులో 6 లక్షల మంది విధవరాళ్లు పింఛన్‌తో పాటు వైయస్ఆర్ చేయూత ద్వారా చెయ్యి పట్టి నడిపిస్తున్నాం. అమూల్ సంస్థకు అక్కా చెల్లెమ్మలే యజమానులు. ఇంత మనసు పెట్టి ప్రతి పథకాన్ని అమలు చేస్తుంటే..వీళ్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీళ్లు మనుషులు అనాలో లేదో ఆ దేవుడే నిర్ణయిస్తారు. ఇప్పటికైనా వారికి జ్ఞానోదయం కలగాలని దేవున్ని కోరుతున్నాం.