హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రేపు తెలంగాణ సీఎంతో భేటీ
 

అమరావతి : ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  గురువారం గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. తెలంగాణ, ఏపీ మధ్య విభజన వివాదాల పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ పర్యటనకు వెళుతున్నారు. 

రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా రెండు రాష్ట్రాల మధ్య పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యలకు సత్వర ముగింపు పలికేందుకు ముఖ్యమంత్రులిద్దరూ ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28, 29 తేదీల్లో మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపనున్నారు. కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. 

Back to Top