కేసీఆర్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికారు.  ఇద్దరు ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చర్చకు రానున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో వైయస్‌ జగన్, కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Back to Top