సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు

తాడేపల్లి: విజయవాడ ప్రేమోన్మాది చేతిలో హతమైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ మేరకు దివ్య తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, దివ్య సోదరుడు దినేష్‌లను సీఎం వైయస్‌ జగన్‌ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను బాధిత త‌ల్లిదండ్రుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి వారు లేఖను అందించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌ ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top