కాసేపట్లో ‘వైయస్‌ఆర్‌ జలకళ’ ప్రారంభం 

తాడేపల్లి: ప్రజా సంకల్పయాత్రలో రైతులకు ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో అమలు చేయనున్నారు. వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు వేయిస్తానని మాటిచ్చిన సీఎం వైయస్‌ జగన్‌ నేడు ఆ హామీని నెరవేర్చబోతున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ‘వైయస్‌ఆర్‌ జలకళ’ పథకం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ‘వైయస్‌ఆర్‌ జలకళ’ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లును ప్రభుత్వం తవ్వించనుంది. ఈ పథకం కోసం రూ.2,340 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top