విజయనగరం బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

విజయనగరం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం పర్యటనకు బయల్దేరారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి రైలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అనంతరం రైలు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం వైయస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. 

రైలు ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు వేగంగా చేపట్టి.. క్షతగాత్రులకు వైద్య సేవలు అందిలా ఆదేశించారు. రైలు ప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. అదే విధంగా ప్రమాదంలో మరణించిన ఇతర రాష్ట్రాల వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 
 

Back to Top