విద్యార్థుల గురించి నాకన్నా ఆలోచించేవారు ఎవరూ ఉండరు 

జగనన్న వసతి దీవెన ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు

పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు సాయం

కోవిడ్‌ సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

జగనన్న వసతి దీవెన ద్వారా విద్యా రంగంలో డ్రాప్‌ అవుట్‌లు తగ్గాయి

జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.2,270 కోట్లు సాయం చేశాం

నాడు–నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చబోతున్నాం

వచ్చే ఏడాది అమ్మ ఒడి పథకానికి ఆప్షన్లు ఇచ్చాం

అంగన్‌వాడీలను వైయస్‌ఆర్‌ ఫ్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నాం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను తీసుకొస్తాం

టెన్త్, ఇంటర్‌ పరీక్షలపై విమర్శలు సరికాదు

తాడేపల్లి: ప్రతి విద్యార్థి భవిష్యత్‌ కోసం తాను ఆలోచన చేస్తానని, విద్యార్థుల గురించి తనకన్నా ఎక్కువగా ఆలోచించేవారు ఎవరూ ఉండరని  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తే నష్టపోయేది విద్యార్థులేనని స్పష్టం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకం, అమ్మ ఒడి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన ద్వారా 10.88 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వర్చువల్‌విధానంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యార్థులతో, తల్లిదండ్రులతో మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

చదువుల దీపాలు వెలిగిస్తే..ఈ తరంతో పాటు భావి తరాల తలరాతలు మారుతాయి. అందులో భాగంగానే ఈ రోజు జగనన్న వసతి దీవెన పథకం ద్వారా  నేరుగా 10.88 లక్షల తల్లుల ఖాతాల్లో  రూ.1,048 కోట్లు జమ చేస్తున్నాం.

ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. రాబోయె  కాలంలో ప్రపంచంతో పోటి పడి ఉన్నత విద్యను చదవాలన్న లక్ష్యంతోనే జగనన్న విద్యా దీవెనతో ఫూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం. ఈ రోజు వసతి దీవెన అందిస్తున్నాం. హాస్టల్స్‌లో విద్యార్థులు బోర్డింగ్, లాడ్జింగ్‌ కోసం ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం. వసతిదీవెన ద్వారా ప్రతి ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు రూ.20 వేలు జమ చేస్తున్నాం.

కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థలో ఆదాయం తగ్గుముఖం పడుతున్నా..రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా కూడా చదువుకున్న విద్యార్థుల ఇబ్బందులు గొప్పవని భావించి ప్రతి విద్యార్థికి తోడుగా ఉండేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ కూడా అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నాం.

విద్యా సంవత్సం డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ విద్యార్థుల బంగారు భవిత లక్ష్యంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ.671.78 కోట్లు జమ చేశాం. తల్లిదండ్రులే కాలేజీకి వెళ్లి పీజులు చెల్లిస్తేనే యాజమాన్యాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది. కాలేజీ యాజమాన్యాలు స్పందించకపోతే నేరుగా ప్రభుత్వానికి ఫీర్యాదు చేసేందుకు అవకాశం కల్పించాం.
తొలి విడతగా ఈ రోజు 10.88 లక్షల మంది  తల్లుల ఖాతాల్లో రూ.1048 కోట్లు  నేరుగా జమ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.2,270 కోట్లు అందించాం. 

జగనన్న వసతి దీవెన పథకం, విద్యా దీవెన పథకాల ద్వారా విద్యా రంగంలో డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. ఇంటర్‌ కాలేజీల్లో చేరుతున్న వారి గ్రేషియో చూస్తే 23 శాతం నుంచి పెంచాం.
జగనన్న అమ్మ ఒడి ద్వారా బడికి పంపే ప్రతి పేదతల్లికి ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం చేస్తున్నాం. తల్లుల ఆప్షన్‌ మేరకు 9 వ తరగతి నుంచి పై తరగతులు చదివే విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు జనవరి 9న అందజేస్తాం. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు ఇప్పటికే ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాను. స్కూళ్లు, అంగన్‌వాడీల రూపు రేఖలు మార్చుతున్నాం. వైయస్‌ఆర్‌ ఫ్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీలను మార్చబోతున్నాం. ఇంగ్లీష్‌ మీడియంలోనే విద్యా బోధన చేస్తున్నాం. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం చర్యలు తీసుకుంటున్నాం.

మూడు దశల్లో నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌ రూపురేఖలు మార్చుతున్నాం. 55,600 అంగన్‌వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. వాటికి కొత్త భవనాలు సమకూర్చుతున్నాం. ప్రతి స్కూల్‌లో తాగునీరు, మరుగుదొడ్లు, పెయింటింగ్, బ్లాక్‌బోర్డులు అన్నీ కూడా మార్చబోతున్నాం.
జగనన్న విద్యా కానుక పథకం ద్వారా ప్రతి పిల్లాడికి కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫాం, షూ, నోట్‌ బుక్స్, పుస్తకాలు, బెల్ట్, టై ఇచ్చాం. ఇవన్నీ ఇవ్వడమే కాకుండా అదనంగా ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ ఇవ్వబోతున్నాం.

జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మెనూ మార్చి నాణ్యమైన భోజనం ఇస్తున్నాం.చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తూ పౌష్టికాహారం అందిస్తున్నామని మీ అన్నగా, తమ్ముడిగా దేవుడి దయతో అడుగులు వేస్తున్నాం.ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.4879 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నాను. 
పోటీ ప్రపంచంలో మన పిల్లలు ఎదుర్కొనేందుకు చదువుల్లో కూడా మార్పులు తీసుకువచ్చాం. డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో మార్పులు తెచ్చాం, స్కీల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు, జాబ్‌ ఓరియెంటేడ్‌ కోర్సులు తెచ్చాం. ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఇవన్నీ చేయగలిగామని గర్వంగా చెబుతున్నాను.

ఈ పథకం తొలి విడతగా రూ.1048 కోట్లతో పాటు డిసెంబర్‌లో రెండో విడతలో రూ.1048 కోట్లు జమ చేస్తాం. ఈ పథకాల ద్వారా కోటి మంది పిల్లలకు రూ.25,713 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నాను.
తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ కూడా ఆలోచించాలి. 10, ఇంటర్‌ పరీక్షల నిర్వాహణపై, బాధ్యతరహితంగా విమర్శలు చేసే వారికి నాలుగు మాటలు చెబుతున్నాను. ప్రతి ఒక్క పిల్లవాడి భవిష్యత్‌ గురించి నా కంటే ఎక్కువగా ఆలోచించేవారు ఎవరు ఉండరని గర్వంగా చెబుతున్నాను. అంతగా మనసు పెట్టి ఆలోచన చేస్తున్నాను. మీ అందరికి కూడా సవినయంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే..ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొంత మంది అదేపనిగా అగ్గి పెట్టాలని, రాజకీయాలను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు.

పరీక్షలు నిర్వహించాలో, వద్దో అన్న అంశంపై కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని రద్దు చేశాయి. దేశమంతా ఒకే పరీక్షా విధానం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచన చేయాలి. పదో తరగతి పాస్‌ సర్టిఫికెట్‌తో విద్యార్థి బయటకు వస్తే ఇదే విద్యార్థి మరో 50 సంవత్సరాలు ఈ సర్టిఫికెట్‌ మీదే భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. మార్కులు, ర్యాంకులు గొప్పగా ఉంటే..పరీక్షలు నిర్వహించని రాష్ట్రాల్లో కేవలం పాస్‌ అని సర్టిఫికెట్‌ ఉంటే వాటితో మంచి కాలేజీలో సీట్లు రావు. అందరూ ఆలోచన చేయాలి.

విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారు. పరీక్షలు రద్దు చేయమని చెప్పడం చాలా సులవైన పని. కానీ అలా చేయకుండా పరీక్షలు నిర్వహించడం అన్నది ఒక బాధ్యత తీసుకొని, అన్ని జాగ్రత్తలతో మంచి చేయాలని ప్రతి అడుగు వేయడం ఇంకా కష్టతరం. అయినా కూడా ఆ రూటే తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు తోడుగా ఉంటున్నాం. మంచి చేయాలన్న ఆలోచనలో నుంచే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఎవరికి నష్టం జరిగించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండదని ప్రతి తల్లికి భరోసా ఇస్తున్నాను .దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో ఇంకా మంచి చేయాలనే మనసు దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్క పిల్లాడికి, తల్లికి మంచి చేయాలని అడుగులు వేస్తున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

Back to Top