విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

లేజర్‌ షో తిలకించిన సీఎం
 

విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్‌ను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ‘మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ రోజు విశాఖ ఉత్సవాలను ప్రారంభిస్తున్నామని సీఎం చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ రాకతో ఆర్కే బీచ్‌ జనసంద్రమైంది. ఈ ఉత్సవ్‌ రెండు రోజుల పాటు కొనసాగనుంది. అంతకుముందు లేజర్‌ షో ద్వారా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర, వైయస్‌ఆర్‌ సువర్ణ పాలన, మహానేత స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు జననేత వైయస్‌ జగన్‌ చేపట్టిన 3648 కిలోమీటర్ల పాదయాత్ర, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సీఎం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, విశాఖ నగరంలోని మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, రైల్, రోడ్డు కనెక్టివిటీని సీఎం వైయస్‌ జగన్‌ చిత్రం, ఆంధ్రప్రదేశ్‌ మ్యాప్‌లో ప్రదర్శించారు. ఈ లేజర్‌ షోను సీఎం వైయస్‌ జగన్‌ తిలకించారు. 
 

Back to Top