రాజమండ్రి: నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహిస్తున్న సెమినార్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశ యాప్‌ను ప్రారంభించారు. యాప్ ప్రారంభించిన అనంతరం ఎస్‌ఓఎస్ బటన్ నొక్కి దిశ కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది నుంచి వచ్చిన స్పందనను సీఎం పరిశీలించారు. దిశ కంట్రోల్ రూమ్ ద్వారా అందిన సమాచారం మేరకు ఎస్‌ఓఎస్ బటన్ నొక్కిన సీఎం వైయస్ జగన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు కొద్ది నిమిషాల్లో నన్నయ్య యూనివర్సిటీకి చేరుకొని దిశ యాప్ ద్వారా వచ్చిన మెసేజ్‌ను సీఎంకు చూపించారు.