ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

పశ్చిమ గోదావరి: ఏలూరులోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు.  ఉదయం 10.30 గంటలకు సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాలకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, ఆస్పత్రి ఆవరణలో వైద్య కళాశాలకు ఫౌండేషన్‌ స్టోన్‌ వేశారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలించారు.  

Back to Top