ఏపీఎన్‌జీవోస్ రాష్ట్ర మ‌హాస‌భ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వానం

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఏపీఎన్‌జీవోస్ అసోసియేష‌న్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) ప్ర‌తినిధులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రిని క‌లిసి ఈనెల 21, 22వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ఏపీఎన్‌జీవోస్ 21వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల‌కు ఆహ్వానించారు. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ఈనెల 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర మ‌హాస‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయి. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో ఏపీఎన్‌జీవోస్‌ ప్రెసిడెంట్‌ బండి శ్రీనివాస రావు, జనరల్‌ సెక్రటరీ కె.వి.శివారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌. చంద్రశేఖర్‌ రెడ్డి ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top