పోల‌వ‌రం ప‌నుల‌ను ప‌రిశీలించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ప‌నుల పురోగ‌తిపై అధికారుల‌తో ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌

పోల‌వ‌రం: ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి అయిన‌ పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌రిశీలిస్తున్నారు. మొద‌ట ఏరియ‌ల్ స‌ర్వే ద్వారా ఏరియల్‌ సర్వే ద్వారా ప్రాజెక్టు ప‌నుల‌ను పరిశీలించిన అనంత‌రం ప‌నుల‌ పురోగతిపై ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిల‌కించారు. వరదల సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం పెంచిన ఎత్తు తీరును, పూర్త‌యిన పనుల వివరాలను అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివరించారు. దిగువ కాఫర్‌ డ్యాం వద్ద పూర్తయిన పనులను సీఎం వైయ‌స్ జగన్‌ పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం గ్యాప్‌-2 వద్ద కోతకు గురైన డయాఫ్రమ్‌ వాల్‌ పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అనంత‌రం పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సీఎం సమీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top