తుపాను పరిస్థితులపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆరా

అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశం

తాడేప‌ల్లి: తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ సీఎం కార్యాలయ అధికారులతో సమీక్షించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంచేశామని, తీసుకోవాల్సిన చర్యలపై వారికి తగిన సూచనలు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామ సచివాలయాల వారీగా కంట్రోలు రూమ్స్‌కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని కూడా సిద్ధంచేశామన్నారు. అవసరమైన చోట శిబిరాలు తెరిచేందుకు కలెక్టర్లు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. తుపాను అనంతరం పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తీరందాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు.

Back to Top