శ్రీకృష్ణుని ఆలయం ప్రారంభోత్సవంలో సీఎం వైయ‌స్ జగన్

వైయ‌స్ఆర్ జిల్లా:  పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు.  ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం పులివెందులలోనే శిల్పారామంను ప్రారంభిస్తారు. ఆపై శ్రీస్వామి నారాయణ్‌ గురుకుల్‌ స్కూల్‌కు సీఎం వైయ‌స్ జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 

ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో అగ్రిక్లచర్‌, హార్టికల్చర్‌ కాలేజీలు స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌సెంట్రల్‌ టెస్టింగ్‌ లేబరేటరీ, అగ్రికల్చర్‌ హార్టికల్చర్‌ ల్యాబ్‌లను ప్రారంభిస్తారు. ఆపై ఆదిత్య బిర్లా యూనిట్‌ను సీఎం వైయ‌స్‌ జగన్‌ సందర్శిస్తారు. అనంతరం సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్తారు. ఆ రాత్రికి ఇడుపులపాయ వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌజ్‌లో బస చేస్తారు. ఇక 10వ తేదీ ఇడుపులపాయలో ఆర్‌కే వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ను సీఎం వైయ‌స్ జగన్‌ ప్రారంభిస్తారు. అనంతరం ఎకో పార్క్‌ వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. 

Back to Top