ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఔదార్యం

ప్రాణాంత‌క జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నవారికి అండ‌గా నిలిచిన సీఎం

త‌క్ష‌ణ సాయంతో పాటు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశం

గంట‌ల వ్య‌వ‌ధిలోనే రూ.ల‌క్ష చొప్పున బాధితుల‌కు అంద‌జేత‌

గుంటూరు: వైయస్ఆర్ యంత్ర సేవా పథ‌కం రెండవ విడత ప్రారంభోత్సవానికి శుక్రవారం గుంటూరు నగరానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రాణాంతక జబ్బు  సమస్యలతో కలసిన బాధితుల సమస్యలను తెలుసుకొని అండ‌గా నిలిచారు. 24 గంటల్లోనే బాధితుల‌కు త‌క్ష‌ణ సాయం అందించ‌డంతో పాటు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాధితులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నందు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, సంయుక్త కలెక్టర్ జి. రాజ కుమారి , శాసన సభ్యులు మద్దాలి గిరిధర్ లు , అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ , డిఆర్ఓ కే. చంద్ర శేఖర రెడ్డి , డిప్యూటీ కలెక్టర్ ఎం.వెంకట శివరామి రెడ్డి, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు లతో కలసి అనారోగ్యంతో బాధపడుతున్న సయ్యద్ ఫరూఖ్ ఆలీ , షేక్ ఖాదర్ బాషా లకు తక్షణ సాయం క్రింద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెక్కులను అందజేయడం జరిగింది. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ యంత్ర సేవా పథ‌కం రెండవ విడత ప్రారంభోత్సవానికి గుంటూరు నగరానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అనారోగ్య సమస్యలతో గుంటూరు నగరం శ్రీనివాసరావుపేటకు చెందిన  14 సంవత్సరాల వయస్సు ఉన్న సయ్యద్ ఫరూఖ్ ఆలీ, 15 సంవత్సరాల వయస్సు ఉన్న షేక్ ఖాదర్ బాషా  తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి ఇరువురికి తక్షణ సాయం క్రింద చెరో లక్ష రూపాయలు అందించవలసిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందన్నారు. 

సయ్యద్ ఫరూఖ్ ఆలీ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని, థైరాయిడ్, లివర్ సమస్యలు కూడా ఉన్నాయని, ప్రభుత్వం నుండి నెల నెల తలసేమియా పెన్షన్ రూ. పది వేలు అందించడం జరుగుతుందన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ సెక్రెటరీ డా. హరికృష్ణ బృందంచే వైద్య పరీక్షలు అందించి మెరుగైన  వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.  

అలాగే గుంటూరు నగరం శ్రీనివాసరావుపేటకు చెందిన 15 సంవత్సరాల వయస్సు ఉన్న షేక్ ఖాదర్ బాషా పుట్టుకతోనే మానసిక వికాలాంగుడని, ఇతనికి వికాలాంగుల పెన్షన్ నెలకు మూడు వేల రూపాయలు అందించడం జరుగుతున్నదన్నారు. షేక్ ఖాదర్ బాషాకు మెడికల్ పెన్షన్ పొందటానికి అర్హత పరిశీలించి మెడికల్ పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రభుత్వ ఖర్చుతో పూర్తి వైద్య సాయం అందించడం జరుగుతుందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top