తాడేపల్లి: సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఎకానమీ పునరుద్ధరణకు క్యాలెండర్ తయారు చేశామని, కలెక్టర్లు, జేసీలు జాగ్రత్తగా అమలు చేయాలని సూచించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు గత ప్రభుత్వ ఇన్సెంటివ్ బకాయిలు రూ.905 కోట్లు రెండు విడతల్లో చెల్లిస్తామని, మే 22న సగం, జూన్‌లో మిగిలిన బకాయిలు చెల్లిస్తామని వివరించారు. కరెంట్ ఫిక్స్‌డ్ చార్జీలను రద్దు చేస్తూ జీవో ఇచ్చాం. మూడు నెలల పాటు రద్దవుతాయన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2020 మే లో.. మే 26న అర్చకులు, పాస్టర్లు, మౌజమ్‌లకు రూ. 5 వేల చొప్పున సాయం. మే 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం. గ్రామాల ఆర్థిక వ్యవస్థను ఆర్‌బీకేలు మారుస్తాయి. దీని కోసం ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్లను కూడా నియమించాం. 2020 జూన్‌లో.. జూన్ 4వ తేదీన వైయస్‌ఆర్ వాహన మిత్ర ఇస్తున్నాం. సొంత ఆటో, క్యాబ్ ఉన్నవారికి వాహన మిత్ర ద్వారా రూ.10 వేల సాయం. జూన్ 10వ తేదీన షాపు ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు రూ. 10 వేల సాయం. జూన్ 17న మగ్గమున్న చేనేత కుటుంబాలకు వైయస్‌ఆర్ నేతన్న హస్తం. ఆప్కోకు సంబంధించిన గత ప్రభుత్వ బకాయిలను జూన్ 17నే చెల్లిస్తాం. జూన్ 24న వైయస్‌ఆర్ కాపు నేస్తం. జూన్ 29న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి రెండో విడత రూ.450 కోట్లు విడుదల. 2020 జూలైలో.. జూలై 1న 1060 కొత్త 104, 108 అంబులెన్స్‌లు ప్రారంభం. జూలై 8 మహానేత వైయస్‌ఆర్ పుట్టిన రోజు సందర్భంగా 27 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ. జూలై 29న రైతులకు వడ్డీలేని రుణాలు. 2020 ఆగస్టులో.. ఆగస్టు 3న వైయస్‌ఆర్ విద్యా కానుక. పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్, బెల్టు, షూ, సాక్స్‌లు ఇస్తాం. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం రోజు గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీ. ఆగస్టు 12న వైయస్‌ఆర్ చేయూత. ఆగస్టు 19న వైయస్‌ఆర్ వసతి దీవెన. ఆగస్టు 26న హౌసింగ్ నిర్మాణం. 15 లక్షల వైయస్‌ఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం. 2020 సెప్టెంబర్‌లో.. సెప్టెంబర్ 11న వైయస్‌ఆర్ ఆసరా సెప్టెంబర్ 25న వైయస్‌ఆర్ విద్యా దీవెన. 2020 అక్టోబర్‌లో.. అక్టోబర్‌లో రెండో విడత రైతు భరోసా, ప్రతి రైతు కుటుంబానికి రూ.4 వేలు. అక్టోబర్‌లో హాకర్స్‌కు ఆర్థికసాయం. గుర్తింపు కార్డు ఉన్న ప్రతి చిరు వ్యాపారికి సున్నా వడ్డీకే రూ. 10 వేల రుణం. 10 లక్షల మంది చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు. 2020 నవంబర్‌లో.. నవంబర్ నెలలో విద్యా దీవెనకు సంబంధించి రెండో దఫా.. పిల్లల ఫీజులు నేరుగా తల్లుల అక్కౌంట్‌లో జమ చేస్తాం. 2020 డిసెంబర్‌లో.. డిసెంబర్‌లో అగ్రిగోల్డ్ బాధితులకు సాయం. 2021 సంవత్సరంలో.. 2021 జనవరిలో రెండో విడత అమ్మ ఒడి ప్రారంభం. 2021 జనవరిలోనే చివరి విడత రైతు భరోసా. (సంక్రాంతి నాటికి పంటను ఇంటికి తెచ్చుకునే సమయంలో రూ.2వేలు.) 2021 ఫిబ్రవరి విద్యా దీవెన మూడో త్రైమాసం, రెండో దఫా వసతి దీవెన. 2021 మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.