పెన్ష‌న్ రూ.2,750.. రేపటి నుంచి పంపిణీ

పింఛన్‌ రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచిన సీఎం వైయస్‌ జగన్‌

కొత్తగా 2.31 లక్షల మందికి మంజూరు.. 64 లక్షలకు పైగా చేరిన లబ్ధిదారుల సంఖ్య

జనవరి 3న రాజమండ్రిలో పెన్షన్‌ పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక లబ్ధిదారులకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త సంవత్సరం– 2023 ప్రారంభం (జనవరి 1వ తేదీ) నుంచి లబ్ధిదారులకు రూ.2,750 పెన్షన్‌ అందించనుంది. దశల వారీగా సామాజిక పింఛన్ల పెంపు అని మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను  నిలబెట్టుకుంటూ ప్ర‌స్తుతం రూ.2,500 ఉన్న పెన్షన్‌ను రూ.2,750కి పెంచారు. పెన్షన్‌ పెంపుతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్‌ పంపిణీ ప్రారంభం కానుంది.

తెల్లవారుజామునే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు చేరుకొని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పెంచి ఇస్తున్న రూ.2,750 పింఛన్‌ను లబ్ధిదారుల చేతుల్లో పెట్టనున్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌ వారోత్సవాలు జరగనున్నాయి. జనవరి 3వ తేదీన రాజమండ్రిలో పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాల్గొంటారు. లబ్ధిదారులతో మాట్లాడ‌నున్నారు.  

కొత్తగా 2.31 లక్షల మందికి వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసింది. కొత్తగా మంజూరైన వారిని కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌ లబ్ధిదారుల సంఖ్య 64 లక్షలకు పైమాటే. దేశంలో ఇంత పెద్ద ఎత్తున సామాజిక పింఛన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే అందుతున్నాయి. 
 

తాజా వీడియోలు

Back to Top