కాసేప‌ట్లో నెల్లూరుకు బ‌య‌ల్దేర‌నున్న సీఎం

తాడేప‌ల్లి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాసేప‌ట్లో నెల్లూరుకు బ‌య‌ల్దేర‌నున్నారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి ఉదయం 10:15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌ల్దేరి 11 గంట‌ల‌కు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్క‌డి నుంచి హెలికాప్ట‌ర్‌లో నెల్లూరు చేరుకొని..  గొలగమూడి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో నెల్లూరులో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top