గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం వైయస్‌ జగన్‌ నివాళులు

మేకపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం వైయస్‌ జగన్‌
 

హైదరాబాద్‌: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దంపతులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని మేకపాటి స్వగృహానికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి, స‌తీమ‌ణీ వైయ‌స్ భార‌తీ గౌతమ్‌రెడ్డి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారిని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

 సీఎం జగన్‌ను చూసి గౌతమ్‌రెడ్డి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. ఆయన గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని  ఓదార్చారు. సీఎం జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి.. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

Back to Top