తాడేపల్లి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లాలని అభిలషించారు.