Day 2: వైయ‌స్ఆర్ జిల్లాలో సీఎం ప‌ర్య‌ట‌న షెడ్యూల్ 

వైయ‌స్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలోని ఏపీఐఐసీ భూముల వద్దకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేరుకుంటారు. 2.10 గంటలకు ఆదిత్య బిర్లా ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. 2.40 గంటలకు జగనన్న హౌసింగ్‌ కాలనీకి చేరుకుని అక్కడ హౌసింగ్‌ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన‌ అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్ర‌సంగిస్తారు. 

3.35నుంచి 3.50గంటలవరకు పులివెందుల టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ యార్డును సీఎం ప్రారంభిస్తారు. 3.55 గంటలకు పులివెందులలోని నూతన మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు అంబకపల్లె రోడ్డులోని రాణితోపు పార్కు ఎదురుగా ఉన్న ఆంధ్ర ఆక్వా హబ్‌ను ప్రారంభిస్తారు. 5.05 గంటలకు ఇడుపులపాయ హెలీప్యాడ్ వద్ద వైయ‌స్ఆర్ సీపీ నాయకులతో కాసేపు మాట్లాడి వైయ‌స్ఆర్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. రాత్రి అక్క‌డే బ‌స చేస్తారు.    

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top