తాడేపల్లి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వరుసగా ఐదో ఏడాది.. వైయస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మునుముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం వైయస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 34, 288 కోట్ల రూపాయలను చెల్లించామని ఆయన తెలిపారు. మొత్తం 53. 58 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎగొట్టిన బకాయిలను తామే చెల్లించామన్నారు. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాం.. కానీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని పెంచి ఇచ్చామని తెలిపారు. రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామని సీఎం వైయస్ జగన్ వెల్లడించారు. ఈ సందర్బంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. రైతు బాగుండాలని మనసా, వాచా నమ్ముతూ.. దేవుడి దయతో ఈరోజు మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా నమ్మిన ప్రభుత్వం మనది.అందుకే 57 నెలల్లో రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా, వాచా, కర్మణా ప్రతిఅడుగు వేస్తూ వచ్చాం. ఈ రోజు 5వ ఏడాది ఎక్కడా క్రమం తప్పకుండా ప్రతి సమయంలో అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ... ఎక్కడా క్రమం తప్పకుండా 5వ ఏడాది మూడో విడత రైతు భరోసాసొమ్మును ఈరోజు విడుదల చేస్తున్నాం. దాదాపు 53.58 లక్షల మంది రైతు కుటుంబాలకు మంచి చేస్తూ.. బటన్ నొక్కి ఈ మూడో విడత సందర్భంగా చేస్తున్న రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో రూ.2వేలు చొప్పున నేరుగా రూ.1078 కోట్లు వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఈ రోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా రూ.13,500 ఇస్తూ వచ్చామో ఇలా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి రైతు కుటుంబానికి రైతు పక్షపాత ప్రభుత్వంగా మొత్తంగా రూ.67,500 ఇచ్చినట్టు అవుతుంది. 53.58 లక్షల మంది రైతులకు మేలు చేస్తూ... ఇలా 53.58 లక్షల మంది రైతన్నలకు కేవలం వైఎస్సార్ రైతుభరోసా– పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.34,288 కోట్లు రైతన్నకు దన్నుగా, రైతులు పంటలు వేసే సమయంలో పెట్టుబడి సహాయంగా అందించాం. ఇది ఎందుకు అంత ప్రాముఖ్యత, అవసరం అన్న విషయానికి వస్తే... రాష్ట్రంలో దాదాపుగా 50శాతం మంది రైతులు అరహెక్టార్ లోపు విస్తీర్ణంలో భూమి ఉన్న పరిస్ధితి. అంటే దాదాపు 50శాతంమంది రైతులకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థిది. అదే ఒక హెక్టార్ వరకు తీసుకుంటే దాదాపు 70శాంతమంది రైతులు ఇదే కోవలోకి వస్తారు. మరి ఈ 50, 70శాతంమంది రైతులు పరిస్థితి ఏమిటంటే..ఈ పెట్టుబడి సహాయం లేకపోతే వీళ్లకు రుణాలు అందడం కష్టం. ఈ రుణాలు అందని పరిస్ధితి, రుణాలు వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి. ప్రయివేటు రుణాలు అయితే వడ్డీలు ఎక్కువ. ఈ పరిస్థితిలో రైతన్న సతమతమవుతాడు. ఇప్పుడు ఈ 1.25 ఎకరాల లోపు ఉన్న 50శాతం మంది రైతన్నలకు గొప్ప మేలు జరుగుతుంది. వీళ్లే వేసే 80శాతం పంటలకుఅయ్యే 80శాతం ఖర్చు ఈ రూ.13,500లో కవర్ అయ్యే గొప్ప అడుగు ఈ 57 నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది. ఈ పెట్టుబడి కూడా ఎప్పుడూ, ఎక్కడా మిస్ కాకుండా పంట వేసే సమయానికే ఖరీప్ మాసంలోనే రూ.7,500 ప్రతి రైతన్న చేతిలో పెడుతున్నాం. మరలా పంట కోసే సమయంలో, అక్టోబరు, నవంబరు మాసంలో మరో రూ.4వేలు ప్రతి రైతన్న చేతుల్లో పెడుతున్నాం. అది పంటకోతకో లేక రబీ అవసరాల కోసం అయినా ఉపయోగపడుతుంది. మరలా రబీ పంట చేతికొచ్చే సమయానికి జనవరి, పిబ్రవరి మాసంలో మరో రూ.2వేలు ఇస్తూ.. ఇలా క్రమం తప్పకుండా రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ.. తనకు అవసరం అయినప్పుడు ఆదుకుంటూ, పెట్టుబడి సాయంగా ఇస్తూ.. ఐదేళ్లలో రైతులకు అందాల్సిన సరైన సమయంలో అందిస్తూ వచ్చాం. ఈ ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.13,500 ఇస్తూ రైతులను చేయిపట్టుకుని నడిపిస్తూ.. ఏకంగా 57 నెలల కాలంలో రూ.67,500 రైతన్నల చేతుల్లో పెట్టినట్టయింది. మరో మంచి కార్యక్రమం సున్నా వడ్డీ రాయితీ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ఇది అయితే రెండో మంచి కార్యక్రమం రైతన్నలు బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న పంట రుణాలు క్రమం తప్పకుండా కడితే బ్యాంకులకు రైతులు మీద నమ్మకం కలుగుతుంది. ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి నెలకొంటుంది. దీన్ని ప్రోత్సహిస్తూ ఎప్పుడూ జరగని విధంగా రైతన్న వడ్డీ సొమ్మ బ్యాంకులకు కట్టిన వెంటనే.. మళ్లీ ఆ వడ్డీ సొమ్మును క్రమం తప్పకుండా రైతులకు తిరిగి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా 2021–22 రబీ పంటకు సంబంధించిన రుణాలు, 2022 ఖరీప్ పంటకు సంబంధించి దాదాపు 10.79 లక్షల మంది రైతులు కట్టిన వడ్డీని తిరిగి వారికి సున్నావడ్డీ రూపంలో తిరిగి చెల్లిస్తూ... రూ.216 కోట్లు నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేసే మంచి కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. ఇది కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న అంశం. రైతులు తీసుకున్న రూ.1లక్ష లోపు క్రాప్ లోన్స్ సక్రమంగా బ్యాంకులుకు కడితే.. వారికి మరలా వడ్డీని తిరిగి వెనక్కి ఇచ్చే కార్యక్రమం వల్ల.. రైతులకు వడ్డీ లేకుండా రుణాలు వస్తాయి. ఈ డబ్బులు రైతులకు వ్యవసాయంలో పెట్టుబడికి ఉపయోగపడతాయి. దీన్ని ప్రోత్సహిస్తూ... ప్రతి రైతుకు సహాయం చేస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన బకాయిలు కూడా కలుపుకుంటే.. 84.67 లక్షల మంది రైతులకు ఇచ్చిన సున్నావడ్డీ రాయితీ దాదాపు రూ.2051 కోట్లు. ఈరోజు ఇచ్చే రైతుభరోసా సొమ్ము, సున్నావడ్డీ కింద ఇచ్చే మరో రూ.216 కోట్లు ఈ రెండింటి ద్వారా ఈ రోజు రూ.1294 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసే మంచి కార్యక్రమం చేస్తున్నాం. దేవుడి ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటాను. రైతన్నలను ప్రతి అడుగులోనూ చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. నవరత్నాల్లోని ప్రతి పథకం రైతన్నలకు అందరికీ అందుబాటులో ఉంచాం. ఈ పెట్టుబడి సహాయాన్ని తీసుకుంటే మనం ఎన్నికల మేనిఫెస్టోలో రూ.12,500 నాలుగేళ్లలో రూ.50వేలు ఇస్తామని చెప్పాం. చెప్పిన దానికన్నా మిన్నగా 5 సంవత్సరాల పాటు అమలుచేస్తూ... రూ.12,500 కంటే ఎక్కువగా రూ.13,500 ఇస్తూ.. 5 సంవత్సరాలలో ఏంకగా రూ.67,500 ఇచ్చాం. చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి రైతుకు రూ.17,500 ఎక్కువగా మన ప్రభుత్వం ఇచ్చింది. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వమిది రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలలో ప్రతి అడుగు రైతుకు మంచి చేసే విధంగా, పెట్టుబడి తగ్గించే విధంగా, రైతుకు తోడుగా నిలబడే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. దాదాపు 19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు పగటిపూటే నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ 57 నెలల కాలంలోనే జరుగుతుంది. మనంఅధికారంలోకి రాకముందు ఇలా పగటిపూటే రైతన్నలకు ఉచిత కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. అవకాశమే లేదు. ఎందుకంటే ఫీడర్లలలో ఆ కెపాసిటీ లేదు. ఫీడర్ల కెపాసిటీ పెంచకపోతే ఇది చేయలేని పరిస్థితి. రూ.1,700 కోట్లు ఖర్చు చేసి.. ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప రైతులకు ఉచితంగా పగటిపూటే 9 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబితే... అది కూడా చేసి రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్, పగటిపూటే ఇచ్చే కార్యక్రమం కూడా ఈ 57 నెలల కాలంలోనే జరుగుతుంది. ఇలా ఈ 19 లక్షల మంది ఈ పంపుసెట్ల మీద, పగటి పూట ఉచిత విద్యుత్ మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చే ఒక్క కార్యక్రమం ద్వారా.. ప్రతి రైతన్నకు రూ.45వేలు మేలు జరుగుతుంది. ఏడాదికి రూ.9వేల కోట్లు ఖర్చు చేస్తూ రైతులకు మంచి చేస్తున్నాం. ఉచిత పంటల బీమా.. ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా ప్రతి రైతన్నను తాను పండించిన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ ఆర్బీకే పెట్టించి... ప్రతి సచివాలయం పరిధిలో ప్రతి ఎకరాను ఇ– క్రాప్ చేయించి, ఆ ఇ–క్రాప్ ఆధారంగా ప్రతి రైతన్న తాను వేసిన పంటను ఇన్సూరెన్స్ కవరేజీలోకి తీసుకొచ్చి, రైతన్న తరపున బీమా ప్రీమియం కట్టాల్సిన సొమ్ము కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ... మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతుల తరపున బీమా ప్రీమియం కడుతున్న రాష్ట్రం మనదే. ఈ 57 ఎలల కాలంలోనే ఇది కూడా జరుగుతుంది. గతంలో ఇది జరగలేదు. ఇంతకముందు రైతన్నకు బీమా ప్రీమియం ఉందన్న సంగతి కూడా తెలిసేది కాదు. కొంతమంది రైతులు మాత్రమే క్రాప్ లోన్ తీసుకుని.. అది ఇచ్చేటప్పుడు మాత్రమే బ్యాంకులు ఇన్సూరెన్స్ కింద బీమా ప్రీమియం సొమ్ముని కట్ చేసుకుని రైతులకు ఇచ్చే పరిస్థితి. ఏ రైతు అయినా బ్యాంకులకు పోకపోతే, రుణాలు రాని పరిస్థితి ఉంటే వారికి ఇన్సూరెన్స్ గురించి తెలిసే పరిస్థితి, కట్టే పరిస్థితి లేదు. ఈ మాదిరిగా రైతులు నష్టపోతున్న పరిస్థితులకు పూర్తిగా చెక్ పెడుతూ.. ప్రతి రైతును ఆటోమేటిక్‌గా తాను పంట వేసిన వెంటనే గ్రామ సచివాలయంలో ఇ– క్రాప్, దాని ద్వారా పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్, వారి తరపున ప్రీమియం కూడా ప్రభుత్వమే కడుతున్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ 57 నెలల కాలంలో ఈ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. రైతు కష్టం ప్రభుత్వ కష్టంగా భావించి.. ప్రతి రైతుకు పెట్టుబడి సహాయంగా డబ్బులు ఇవ్వడం, సున్నావడ్డీ వర్తింప జేస్తూ రూ.1లక్ష వరకు క్రాప్ లోన్స్ పెట్టుబడికి సహాయంగా ఇప్పించే కార్యక్రమం కూడా మన హయాంలోనే జరిగింది. ఈ 5 సంవత్సరాలలో ఇంతకముందు జరగని గొప్ప మార్పు ఏమిటంటే... ఎక్కడైనా రైతన్నకు వరదలు వంటి ఏ కష్టం వచ్చినా దాన్ని ప్రభుత్వం తన కష్టంగా భావించింది. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా కూడా.. రైతన్న కష్టం ఇంకా ఎక్కువ కష్టంగా భావించింది. రైతన్నను చేయిపట్టుకుని నడిపించే చర్యల్లో భాగంగా ఏ సీజన్‌లో జరిగిన నష్టం అదే సీజన్ ముగిసేలోగా రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ.. రైతన్నకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ 57 నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతుంది. ఇది విప్లవాత్మకమైన మార్పు. ఎందుకంటే రైతులు రానున్న సీజన్‌లో పంటవేసుకునేందుకు ఈ సీజన్‌లో జరిగిన నష్టానికి తట్టుకుని నిలబడాలి, వచ్చే సీజన్‌లో కనీసం పంటలు వేసుకునే పరిస్థితుల్లోకి రావాలి. అలా జరగాలంటే ఈ సీజన్‌లో జరిగిన పంటనష్టానికి ఇన్‌పుట్ సబ్సిడీ ఈ సీజన్ అయిపోయేలోగానే డబ్బులు చేతికొస్తే.. ఈ డబ్బులు రైతులకు మరలా పెట్టుబడిగా వచ్చే సీజన్‌కు ఉపయోగపడుతుందని రైతుల తరపున ప్రభుత్వం ఆలోచన చేసి... వారికి బాసటగా ఉన్న ప్రభుత్వం మనది. అలాంటి ఆలోచనలు ఈ 57 నెలల్లోనే జరిగాయి. రైతులను చేయిపట్టుకుని నడిపిస్తూ.. ఎప్పుడూ జరగని విధంగా గ్రామస్ధాయిలో ఏజీబియస్సీ చదివిన అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్.. రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంటాడు. ఇలా గ్రామసచివాలయాలకు ఎక్స్‌టెన్షన్‌గా దాదాపుగా 10,778 ఆర్బీకేలను గ్రామస్ధాయిలో స్ధాపించాం. రైతులకు అన్ని రకాలుగా సూచనలు, సలహాలు ఇస్తూ ఇ–క్రాప్ చేస్తూ.. రైతులను విత్తనం నుంచి అమ్మకం వరకూ ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే జరిగింది. ఆక్వా రైతులనూ ఆదుకుంటూ.. గతంలో ఆక్వా రైతులకు రూ.1.50కే కరెంటు ఇచ్చి వారిని అదుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు ఇస్తూ... వారిని కూడా చేయిపట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటున్న పరిస్థితులూ కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వం కాలంలోనే ఉన్నాయి. మొట్టమొదటసారిగా రైతన్నలకు మంచి చేస్తూ.. ఆర్బీకే స్ధాయిలోనే పంటలను కొనుగోలు చేసే విధంగా అడుగులు వేసింది. రైతులకు కనీస మద్ధతు ధర రావాలని.. ప్రతి ఆర్బీకేలోనూ ఫలానా పంటలకు ఇది కనీస మద్ధతుధర అని.. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలకు కూడా మనం కనీస మద్ధతు ధర నోటిఫై చేసి.. ఇంతకన్నా పంట ధర తగ్గినప్పుడు వెంటనే జాయింట్ కలెక్టర్, మార్కెటింగ్‌శాఖ అలెర్ట్ అయి ఆ ఆర్బీకే నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతున్నది కూడా మన ప్రభుత్వంలోనే. పాడి రైతులకూ అండగా- అమూల్ తోడుగా రైతులకు తోడుగా కొత్తకొత్త చట్టాలు తీసుకువచ్చాం. చివరికి పాలసేకరణలో కూడా గతంలో జరగని విధంగా.. ప్రతి లీటరుపైనా రైతులకు రూ.10 నుంచి రూ.22 వరకు ఆవు, గేదె పాల ధరలు ఈ 57 నెలల కాలంలోనే పెరిగాయి. కారణం మనం పాలవెల్లువ అనే కార్యక్రమం చేశాం. సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్దదైన అమూల్ లాంటి సంస్ధను తీసుకువచ్చాం. తద్వారా లోకల్‌గా కాంపిటేషన్ క్రియేట్ చేశాం. తద్వారా అమూల్ రేట్లు పెంచారు కాబట్టి మిగిలిన వారు కూడా పెంచక తప్పని పరిస్థితి. ఇంకోక గొప్ప మార్పు ఏమిటంటే... 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్ల కాలంలో మన భూములు సర్వే జరిగింది. గొడవలు, రికార్డులు అప్‌డేట్ కాకుండా ఉండడం, సబ్‌డివిజన్లు జరగకపోవడం, సర్వేలు జరగకపోవడం వీటన్నింటితో ప్రతి గ్రామంలోనూ వివాదాలే. వీటన్నింటికీ చెక్ పెడుతూ 100 ఏళ్ల తర్వాత సమగ్ర భూసర్వే చేపట్టి.. రికార్డులు అన్ని అప్‌డేట్ చేసి, ఏకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గ్రామస్ధాయిలో సచివాలయ పరిధిలోకి తీసుకువచ్చిన గొప్ప మార్పు కూడా ఈ 57 నెలల్లోనే జరుగుతుంది . దాదాపుగా 34.72 లక్షల ఎకరాల మీద రైతులకు, పేదలు, భూయజమానుల చేతుల్లో అసైన్డ్ భూముల మీద వాళ్లకు పూర్తి హక్కుల కల్పిస్తూ... ఏకంగా చట్టాలలో మార్పులు తీసుకొచ్చాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. గతానికి ఈ 57 నెలల కాలానికి మధ్య తేడా గమనించండి. ఈ వీసీ ద్వారా ప్రతి ఆర్బీకే కనెక్ట్ అయి ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాడు కాబట్టి.. వారందరికీ ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే వారికి తెలియజేస్తున్నాం. రుణమాఫీ పేరుతో బాబు మోసం. గతంలో చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో ఏకంగా రూ.87,612 కోట్ల రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పినమాటలు నమ్మారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే.. బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, దాన్ని రైతులు నమ్మితే... .. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతులను మోసం చేశాడు అని గమనించమని అడుగుతున్నాను. ఏకంగా రూ.87,612 కోట్ల రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి... చంద్రబాబు నాయుడు గారు చివరికి ఆ రూ.87,612 కోట్ల మీద పడే సున్నావడ్డీని కూడా ఎగురగొట్టాడు. ఆయన ఎగ్గొట్టిన సున్నావడ్డీ బకాయిలు కూడా మనమే ఇచ్చాం. ఏడాదికి దాదాపు రూ.5వేల కోట్లు లెక్కేసుకున్న ఐదేళ్లలో రూ.30వేల కోట్లు వడ్డీలకే అవుతంది. అలాంటిది ఆయన కట్టింది కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే. అంత దారుణంగా గతంలో చంద్రబాబు మోసం చేస్తే... ఈ 5 సంవత్సరాలలో మనం కేవలం వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే ఒకే ఒక్క పథకం ద్వారా రైతుల చేతుల్లో రూ.34 వేల కోట్లు పెట్టాం. రైతన్నలకు సంబంధించి ధాన్యం కొనుగోలు కోసం మనం ఖర్చుపెట్టిన రూ.65 వేల కోట్లు కాక, మరో రూ.1.20 లక్షల కోట్లు రైతన్నలకు వివిధ పథకాల ద్వారా మంచి జరిగిస్తూ మనం ఖర్చు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ, రైతు నష్టపోకుండా, వారిని చేయిపట్టుకుని నడిపిస్తూ.. వారికి మంచి చేసే కార్యక్రమం ఈ 57 నెలల్లో జరిగింది. ఈ తేడాను గమనించమని, ప్రతి ఒక్కరికీ జ్ఞాపకం తెచ్చుకోమని మనసారా కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.