ద్రౌప‌ది ముర్ముకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తుల ఘ‌న‌స్వాగ‌తం

తాడేప‌ల్లి: ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దంప‌తులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి తాడేప‌ల్లిలోని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాసానికి చేరుకున్న ద్రౌప‌ది ముర్ముకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్ భారతి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్మును శ్రీ‌క‌న‌క‌దుర్గ ఆల‌య అర్చ‌కులు వేద ఆశీర్వ‌చ‌నం అంద‌జేసి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. అనంత‌రం శ్రీ దుర్గా మ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల చిత్ర‌ప‌టాన్ని ద్రౌప‌ది ముర్ముకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అంద‌జేశారు. ద్రౌప‌ది ముర్ము వెంట కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఉన్నారు. ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్  పార్టీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే..

Back to Top