చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తిరుపతి: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి తండ్రి సుబ్రమణ్యంరెడ్డి(76) సోమవారం రాత్రి మృతిచెందారు. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి జిల్లా తుమ్మలగుంటలోని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి నివాసానికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. చెవిరెడ్డి సుబ్ర‌మ‌ణ్యంరెడ్డి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం చెవిరెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ఓదార్చారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి, ఎమ్మెల్యేలు ఉన్నారు. 

Back to Top