ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

గుంటూరు: ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే గిరిధర్‌ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. గుంటూరు శ్యామలానగర్‌లో మద్దాలి గిరిధర్‌ నివాసంలో శివ‌పార్వ‌తి చిత్ర‌ప‌టానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళుల‌ర్పించి, ఎమ్మెల్యే  కుటుంబ సభ్యులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పరామర్శించి, ధైర్యం చెప్పారు. 

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ మాతృమూర్తి శివపార్వతి సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయానికి మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.  

 
  

Back to Top