ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

తాడేప‌ల్లి: తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ‘ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది. గ్లోబల్‌ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసిన పాట ఇది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసింది. ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న భారత సినిమాకు ఈ అవార్డు మరింత ప్రోత్సహకాన్ని ఇచ్చింది’ అని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top