ఇస్రో బృందానికి సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు

తాడేపల్లి: ఇస్రో బృందానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. టెస్ట్‌ వెహికల్‌ ఫ్లైట్‌ టీవీ డీ1 సక్సెస్‌పై సీఎం వైయస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో మరింత ఎల్తైన కక్ష్యలోకి ఇస్రో దూసుకెళ్తోందని సీఎం కొనియాడారు. 
 
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేప‌డుతున్న‌ గగన్‌యాన్‌ మిషన్‌లో తొలి పరీక్ష ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’(టీవీ-డీ1)ప్రయోగం విజయవంతమైంది. ఈరోజు ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్‌ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్‌ పారాచూట్‌ల సాయంతో కిందకు సురక్షితంగా  ల్యాండ్‌(సముద్రంలోకి) అయ్యింది.

Back to Top