నూత‌నంగా ఎన్నికైన ఎమ్మెల్సీల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

అమ‌రావ‌తి:  ఇటీవ‌ల నిర్వ‌హించిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపొందిన వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుదారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. ఇవాళ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ. రామచంద్రారెడ్డి,  ఎ. మధుసూదన్‌, పి. చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిలు క‌లిశారు. వారిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. 

Back to Top