‘మనసానమః’ చిత్ర దర్శకుడికి సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు

తాడేపల్లి: ‘మనసానమః’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించి, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు అందుకున్న యువ దర్శకుడు దీపక్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో దీపక్‌రెడ్డి రూపొందించిన ‘మనసానమః’ షార్ట్‌ ఫిల్మ్‌ 900పైగా పురస్కారాలు అందుకోవడమే కాకుండా గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దీపక్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దీపక్‌రెడ్డికి సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. మరిన్ని మంచి చిత్రాలు రూపొందించి అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. 
 

Back to Top