సీనియ‌ర్ న‌టి జ‌మున మృతి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు

న‌టి జ‌మున మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేపల్లి: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ సీనియర్‌ నటి, మాజీ ఎంపీ జమున (86) మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జమున మృతితో తెలుగు చిత్రసీమలో స్వర్ణ యుగానికి తెరపడినట్లు అయ్యిందన్నారు. జమున కుటుంబ సభ్యులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌..
సీనియ‌ర్ న‌టి జ‌మున మృతికి సంతాపం తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. `తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ మొద‌టిత‌రం నటీమణులలో అగ్ర‌క‌థానాయ‌కిగా వెలుగొంది తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గని ముద్ర‌వేసుకున్న జ‌మున గారు మృతి చెంద‌డం బాధాక‌రం. ఆవిడ‌ మృతి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. జ‌మున గారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి`` తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు.

Back to Top