రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సంతాపం

తాడేప‌ల్లి:కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌ముఖ సినీ న‌టుడు రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మృతిప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ``కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. కృష్ణంరాజు గారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top