మంచి రోజున.. గొప్ప కార్య‌క్ర‌మం చేప‌డుతున్నాం

క్రిస్మ‌స్‌, వైకుంఠ ఏకాదశిన రాష్ట్ర‌వ్యాప్తంగా ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేస్తున్నాం

మంచి జరుగుతుంటే కొందరు కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నారు

పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నందుకు బాధగా ఉంది

సుప్రీం కోర్టు వరకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తాం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పులివెందుల: ‘క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి ఒకే రోజు రావడం చాలా అరుదైన సందర్భం. ఇంత మంచి రోజున రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనలు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నాను కానీ, పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నాననే చిన్న బాధ మనసులో ఉందన్నారు. నిన్ననే ఓ వ్యక్తి హై కోర్టుకు వెళ్లి పులివెందులలో పేదలకు ఇచ్చే 8,300 ఇళ్ల పట్టాలు ఏపీఐఐసీ భూముల్లో ఇవ్వకూడదని స్టే తీసుకురావడం మనసుకు బాధ అనిపిస్తుందన్నారు.

‘ఏపీఐఐసీ అయినా ప్రభుత్వమే.. భూములు ఇచ్చేది ప్రభుత్వమే. ఏపీఐఐసీలో భూములు చాలా ఉన్నాయి. అక్కడ పరిశ్రమలు వస్తే.. పరిశ్రమల్లో పనిచేయడానికి  చాలా ఇళ్లు ఉంటేనే వర్క్‌ఫోర్స్‌ అందుబాటులో ఉంటుందని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేసులు వేసి అడ్డుకుంటున్నారు. జరిగే ప్రతి మంచిని అడ్డుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31.75 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అందులో 3.70 లక్షలు 10 శాతం ఇళ్ల పట్టాలు రకరకాల కుట్రల వల్ల ఆలస్యం అవుతున్నాయి. కానీ, పైనుంచి దేవుడు చూస్తున్నాడు. త్వరలో సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయినా సరే స్టేలు ఎత్తేయించి.. పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయిన ప్రాంతాల్లో అందరికీ ఇళ్ల పట్టాలు అందజేసి ఇళ్లు కూడా కట్టిస్తాం. మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా గొప్పగా ప్రజలందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు.  

 

Back to Top