చిత్తూరు: జిల్లాలో వరద నష్టాలు పరిశీలించి, బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 2వ తేదీన జిల్లాకు రానున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌కు పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ►మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి రేణిగుంట విమానశ్రయానికి చేరుకుంటారు. 3.40కు రోడ్డుమార్గాన బయలుదేరి 3.55 గంటలకు రేణిగుంట మండలంలోని వేదాలచెరువు ఎస్టీ కాలనీకి చేరుకుని కాలనీవాసుల సమస్యలతో మాట్లాడతారు. ►4.30కు బయలుదేరి 4.40 గంటలకు ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేటకు చేరుకుని నష్టాలను పరిశీలిస్తారు. ►4.55కు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు తిరుచానూరు–పాడిపేట క్రాస్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడతారు. ►5.40 గంటలకు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని 7 గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో వరదలపై సమీక్షిస్తారు. ఆరోజు అక్కడే బసచేస్తారు. ►3వ తేదీ ఉదయం 8.30కు పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరి 8.40 గంటలకు తిరుపతిలోని కృష్ణానగర్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడుతారు. – ►9.25 గంటలకు బయలుదేరి ఆటోనగర్‌కు చేరుకుని బాధితుల సమస్యలు తెలుసుకుంటారు. ►10.20 బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, 10.30కి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు పయనమవుతారు